‘రంగస్థలం’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శత్రు !

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన సినిమా ‘రంగస్థలం’. ఈ సినిమా విజయం సాదించడమేగాక చరణ్ తో పాటు అందులో నటించిన ప్రతి ఒకరికి మంచి పేరును తెచ్చిపెట్టింది. ఎందుకంటే దర్శకుడు సుకుమార్ ప్రతి పాత్రను అంత జాగ్రత్తగా డిజైన్ చేశారు. అలాంటి వాటిలో ఆది పినిశెట్టి, అనసూయ, అజయ్ ఘోష్, మహేష్ ఆచంట చేసిన పాత్రలతో పాటు నటుడు శత్రు చేసిన ఫుల్ లెంగ్త్ రోల్ కూడ ఒకటి.

సినిమా మొదట్లో హీరోతో గొడవపెట్టుకుని ఆ తరవాత కథకి అనుగుణంగా మంచితనంతో ఎన్నికల్లో హీరోకి, అతని అన్నకి సపోర్ట్ చేసే ఈ పాత్రతో శత్రు తనలోని నటుడ్ని ఇంకాస్త బయటపెట్టి ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యారు. చాలా మంది సినీ ప్రముఖులు సైతం ఆయన నటనకుగాను ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఆయన్ను అభినందిస్తున్నారు. గతంలో ‘కృష్ణాగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న శత్రు ‘బాహుబలి-2, లెజెండ్, ఆగడు’ వంటి సినిమాలు చేశారు. ప్రస్తుతం ఈయన తమిళ హీరో కార్తి చేయనున్న ఓ సినిమాలో ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ చేయనున్నారు.

Exit mobile version