“RRR”లో ఆమె రోల్ మరో పెద్ద హైలైట్.!

“RRR”లో ఆమె రోల్ మరో పెద్ద హైలైట్.!

Published on May 28, 2021 8:00 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం “రౌద్రం రణం రుధిరం”. ఇంకా కొంత మేర మాత్రం షూట్ బ్యాలన్స్ ఉన్న ఈ చిత్రం రికార్డు స్థాయి బిజినెస్ ను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా రాజమౌళికి ఈ చిత్రం బాహుబలి లాంటి ఎన్నో వండర్ ఫుల్ కథలు అందించిన ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మొన్ననే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం సాలిడ్ అప్డేట్ ఇచ్చారు.

మరి ఇప్పుడు ఆలీతో సరదాగా షోలో స్పెషల్ గెస్ట్ గా వచ్చి మరో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఈ “RRR” సినిమా తాను చూసా అని అలాగే ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ రోల్ కోసం చెప్పారు. ఆమె కనిపించేది సినిమాలో తక్కువ సేపే అయినా ఆ కాస్త సేపు కూడా తన పెర్ఫామెన్స్ మామూలుగా ఉండదని తెలిపారు. అంతే కాకుండా కొద్దీ సేపు హైలైట్ గా ఉంటుందని ఆయన తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు