రిలీజ్‌కి సిద్ధమైపోయిన ‘షేర్’..!

రిలీజ్‌కి సిద్ధమైపోయిన ‘షేర్’..!

Published on Oct 29, 2015 8:19 PM IST

sher
‘పటాస్’ లాంటి సూపర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన షేర్ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని రేపు (అక్టోబర్ 30న) పెద్ద ఎత్తున థియేటర్లలో వాలిపోనుంది. ‘పటాస్’తో వచ్చిన సక్సెస్‌ను ఈ సినిమాతోనూ నిలుపుకోవాలని కళ్యాణ్ రామ్ షేర్ విషయంలో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పటాస్‌లో బాగా వర్కవుట్ అయిన ఎంటర్‌టైన్‌మెంట్ కాన్సెప్ట్‌ను ఈ సినిమాలోనూ ఉండేలా ప్లాన్ చేశారు.

ఇక ఫ్యామిలీ, లవ్ అంశాలు ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్, ఓ సాఫ్ట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. అయితే కళ్యాణ్ రామ్ మార్క్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా భారీ ఎత్తున ఉండనున్నాయని సమాచారం. కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను షేర్ సినిమాను కొమర వెంకటేష్ నిర్మించారు. రేపు రిలీజ్ అవుతున్న సినిమాల్లో పెద్ద రిలీజ్ షేర్ సినిమాయే అవ్వడం వల్ల ఈ సినిమాకు అంతటా మంచి ఓపెనింగ్స్ వచ్చే సూచనలున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే దీపావళి సీజన్ బాగా కలిసివచ్చే అంశం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు