ఆమె వస్తూనే ఇద్దరికి ఝలక్ ఇచ్చింది

ఆమె వస్తూనే ఇద్దరికి ఝలక్ ఇచ్చింది

Published on Sep 3, 2019 12:40 PM IST

బిగ్ బాస్ షో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరు వస్తారా అనే ఊహాగానాలకు తెరదించుతూ పోయిన ఎపిసోడ్ లో ఒకప్పటి యాంకర్ శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్య పరిచారు. బిగ్ బాస్ గురించి ప్రతి అప్డేట్ ముందుగానే తెలిసిపోతున్నప్పటికీ శిల్పా ఎంట్రీ పై ఎటువంటి ముందస్తు సంమాచారం లేకపోవడం గమనార్హం. శిల్పా మంచి యాంకర్ కావడంతో పాటు, అనేక చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఈమె రాకతో బిగ్ బాస్ షో కొంచెం ఆసక్తికరంగా మారింది.

కాగా ఈమె వస్తూ,వస్తూనే ఇద్దరి స్ట్రాంగ్ ప్లేయర్స్ ని ఎలిమినేషన్ కి నామినేట్ చేశారు. అలీ, శ్రీముఖిలను ఆమె నామినేట్ చేయగా మరో ప్రక్రియ ద్వారా రాహుల్, రవి కృష్ణ, మహేష్ విట్టా నామినేట్ కావడం జరిగింది. మొత్తంగా ఈ వారం ఎలిమినేషన్ కి గాను, అలీ, శ్రీముఖి, రవి కృష్ణ, మహేష్, రాహుల్ నామినేట్ కబడ్డారు. గతవారం కూడా ఎలిమినేషన్ లేని పక్షంలో వచ్చే వారం ఈ ఐదుగురిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు