
‘పండగ చేస్కో’ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో జోరు మీదున్న హీరో రామ్ వరుసగా రెండు సినిమాలను సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో శివం సినిమా ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకొని పాటల కోసం నార్వేకు షిఫ్ట్ అయింది. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రామ్ ఎనర్జీకి సరిపడే హై రేంజ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో కలగలిపిన లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
ఇక తాజాగా శివం రిలీజ్ సెప్టెంబర్ నెలా? అక్టోబర్ నెలా? అన్న కన్ఫ్యూజన్కు తెరదించుతూ అక్టోబర్ 2వ తేదీకి రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. కొద్దిసేపటి క్రితమే రామ్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా ఇప్పటికే ‘కంచె’ విడుదలకు సిద్ధమైపోగా శివం కూడా అదే రోజుకు ఫిక్స్ అయింది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలూ కలిసిన ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని నిర్మాత స్రవంతి రవికిషోర్ తెలిపారు.
కొత్త దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి టేకింగ్‌తో పాటు, రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్‌గా నిలుస్తాయని సినిమా యూనిట్ చెబుతోంది. రామ్ సరసన హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.