
ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా సినిమా ‘శివమ్’ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా ద్వారా శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆల్బమ్ ఈ మధ్యే విడుదలైంది. రామ్-దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ కావడంతో ఈ ఆడియోపై మంచి అంచనాలే కనపడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే రూపొందిన ఆల్బమ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
శివమ్ ఆడియోలో మొత్తం ఐదు పాటలుండగా, ఐదు కూడా దేనికవే ప్రత్యేకత చాటుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రేమ అనే ఒక పిచ్చి, అందమైన లోకం, శివమ్ శివమ్ పాటలకు అంతటా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓ హై వోల్టేజ్ లవ్‌స్టోరీతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ టీజర్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆల్బమ్‌లోని పాటలను అందమైన లొకేషన్స్‌లో షూట్ చేయడం ఈ సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తుందని చెప్పొచ్చు. రామ్ సరసన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

