‘జయలలిత’ బయోపిక్ లో శోభన్ బాబు ?

‘జయలలిత’ బయోపిక్ లో శోభన్ బాబు ?

Published on Oct 31, 2019 10:32 PM IST

Shoban Babu

దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా, విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ‘తలైవి’ అనే టైటిల్ తో అమ్మ బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా జయలలిత జీవితంలో ముఖ్యమైన భూమిక పోషించిన ఎం.జి.ఆర్ మరియు కరుణానిథి పాత్రలకు ఇప్పటికే నటులను ఎంపిక చేసిన చిత్రబృందం. అలాగే జయలలిత జీవితంలో మరో కీలకమైన పాత్ర అలనాటి అందాల హీరో శోభన్ బాబుది. మరి శోభన్ బాబు పాత్రలో ఎవరు నటిస్తారో ?

అసలు శోభన్ బాబు గురించి సినిమాలో ప్రస్తావిస్తారా… ప్రస్తావించకపోతే అప్పుడు బయోపిక్ పరిపూర్ణం కానట్లే. ఒకవేళ ప్రస్తావిస్తే జయలలిత అభిమానులు మనోభావాలు దెబ్బతింటాయని కూడా చిత్రబృందం భావిస్తోంది. ఈ క్రమంలో శోభన్ బాబు పాత్రను కేవలం అతిధి పాత్రలానే చూపించి ముగించాలని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో ఎం.జి.ఆర్ (మ‌రుతూర్ గోపాల రామ‌చంద్ర‌న్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి న‌టిస్తుండగా.. కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు