ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన కెరీర్ 111వ చిత్రాన్ని తన హిట్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని మేకర్స్ గ్రాండ్ స్కేల్ లో సాలిడ్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా మాత్రమే కాకుండా ఒక దేశభక్తి ఎలిమెంట్ తో కూడా తెరకెక్కిస్తున్నారు.
ఇలా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఊహించని విధంగా ఓ క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన వీడియో ఫుటేజ్ విజువల్స్ లీక్ అయ్యి వైరల్ గా మారాయి. దీనితో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఈ సీక్వెన్స్ కోసమే డిస్కషన్ నడుస్తుంది.
బాలయ్యతో గోపీ ఈసారి వీరసింహా రెడ్డి లాంటి మాస్ సినిమా తర్వాత ఓ సాలిడ్ స్టైలిష్ యాక్షన్ ఫ్లిక్ తెరకెక్కిస్తున్నారని అంచనాలు మరింత ఎక్కువ పెట్టుకుంటున్నారు. అయితే ఈ లీక్ ని ఇపుడు మేకర్స్ సోషల్ మీడియాలో తొలగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.
