తెలుగు ఆడియెన్స్ లో తన కెరీర్ స్టార్ట్ చేసిన కొన్నేళ్లలోనే మంచి ఫేమ్ అందుకున్న అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరిగా హన్సిక మోత్వానీ కూడా నిలిచింది. దేశముదురు సినిమాతో సెన్సేషన్ గా మారిన ఆమె ఆ తర్వాత అక్కడ నుంచి పెళ్లి చేసుకోవడానికి చాలానే సమయం తీసుకుంది. ఇలా గత కరోనా లాక్ డౌన్ సమయంలోనే చాలామంది తారలు చేసుకున్నట్టే హన్సిక కూడా పెళ్లి చేసేసుకుంది. గత 2022లో సోహైల్ ఖటురీయా అనే వ్యక్తిని విహహం చేసుకుంది.
కానీ ఇప్పుడు ఊహించని విధంగా విడాకులు తీసుకున్నట్టు పలు కథనాలు వినిపిస్తున్నాయి. గత 2022 నవంబర్ లో పారిస్ లో పెళ్లి చేసుకున్న వీరు ఇప్పుడు ముంబైలో వేరయ్యారట. అయితే వీరికి గత కొన్నాళ్ల నుంచి ఉన్న పర్శనల్ ఇష్యూస్ ఉన్నాయట. కానీ అవి అలా పెరుగుతూ వచ్చాయి తప్పితే తగ్గలేదు అని తెలుస్తుంది. సో ఎట్టకేలకి ఇద్దరూ వేరవ్వాలనే నిర్ణయం తీసుకొని విడిపోయినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి హన్సిక నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి.
