షాకింగ్ : అప్పుడే సాయి పల్లవి రణబీర్ ల “రామాయణ” పిక్స్ లీక్

షాకింగ్ : అప్పుడే సాయి పల్లవి రణబీర్ ల “రామాయణ” పిక్స్ లీక్

Published on Apr 27, 2024 1:04 PM IST

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పలు భారీ చిత్రాల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ అలాగే నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “రామాయణం” కూడా ఒకటి.

అయితే ఈ పర్టిక్యులర్ కాంబినేషన్ పట్ల అందరిలో మంచి ఆసక్తి నెలకొనగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఊహించని విధంగా లీక్స్ బయటకి వచ్చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. రీసెంట్ గానే సినిమా షూటింగ్ స్టార్ట్ కాగా ఈ గ్యాప్ లోనే సాయి పల్లవి, రణబీర్ ఇద్దరి పిక్స్ కూడా సెట్స్ నుంచి బయటకి వచ్చేసాయి.

దీనితో బాలీవుడ్ వర్గాల్లో అభిమానుల్లో ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ చిత్రంలో కన్నడ రాక్ స్టార్ యష్ కూడా కీలక పాత్ర చేయనున్నాడు అని టాక్ ఉంది. కానీ ఈ గ్యాప్ లో ఆకస్మికంగా ఈ పిక్స్ లీక్ అవ్వడం అనేది ఆశ్చర్యంగా మారింది. రీసెంట్ గానే రణబీర్ “అనిమల్” తో భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఈ చిత్రం చేస్తుండడంతో దీనిపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు