తెలుగు రాష్ట్రాల్లో ‘ప్యారడైజ్’ కి షాకింగ్ బిజినెస్!? టైర్ 1 లోకి వచ్చేసిన నాని!

తెలుగు రాష్ట్రాల్లో ‘ప్యారడైజ్’ కి షాకింగ్ బిజినెస్!? టైర్ 1 లోకి వచ్చేసిన నాని!

Published on Sep 17, 2026 12:30 AM IST

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే ది ప్యారడైజ్. నాచురల్ స్టార్ నాని హీరోగా కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సాలిడ్ పీరియాడిక్ డ్రామా విడుదల పట్ల మంచి ఆసక్తి నెలకొంది.

ఇంకా పనులు చాలా బ్యాలన్స్ ఉన్నప్పటికీ మేకర్స్ విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పడంతో బయ్యర్లలో కూడా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. పైగా నాని మినిమం గ్యారెంటీ హీరో కూడా కావడంతో ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా కూడా ఎలాంటి డోకా లేదు.

ఇదిలా ఉండగా కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాకి 100 కోట్లకి పైగా బిజినెస్ కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే జరిగింది అట. ఈ సినిమా అనౌన్స్మెంట్ గ్లింప్స్ వచ్చినప్పుడే చాలా మంది నాని టైర్ 1 స్టార్స్ లీగ్ లోకి వెళ్లిపోతాడని నమ్మారు.

ఇప్పుడు బిజినెస్ లెక్కలు చూస్తుంటే అది నిజం అయ్యింది అని కూడా చెప్పొచ్చు. మన తెలుగు బిగ్ స్టార్స్ కి మాత్రమే మన తెలుగు స్టేట్స్ లో 100 కోట్ల బిజినెస్ జరిగాయి. సో ఇప్పుడు నాని కూడా టైర్ 1 స్టార్స్ లోకి ఎంటర్ అయ్యిపోయాడు అని చెప్పవచ్చు. మరి ఈ టార్గెట్ ని నాని అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు