షాకింగ్ : ‘పుష్ప’ నటుడి అరెస్ట్

షాకింగ్ : ‘పుష్ప’ నటుడి అరెస్ట్

Published on Dec 7, 2023 2:30 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కి ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి సక్సె సొంతం చేసుకున్న మూవీ పుష్ప ది రైజ్. ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా పుష్ప ది రూల్ మూవీ రూపొందుతోంది. ఇక ఈ మూవీలో హీరో అల్లు అర్జున్ కి స్నేహితుడిగా కేశవ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్నారు జగదీశ్ ప్రతాప్ భండారి. అయితే షాకింగ్ విషయం ఏమిటంటే, నేడు కొద్దిసేపటి క్రితం జగదీష్ ని హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

తన కెరీర్ బిగినింగ్ లో ఒక అమ్మాయితో కలిసి షార్ట్ ఫిలిం చేసారు జగదీష్. అప్పటి నుండి ఆమెతో మంచి స్నేహం గల జగదీష్, ఇటీవల ఒక అబ్బాయితో ఆమె కలిసి ఉన్న పిక్ ని తీసి అప్పటి నుండి ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. కాగా అది భరించలేని సదరు యువతీ నవంబర్ 29న ఆత్మహత్య చేసుకుంది. కాగా ఈ విషయమై యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు జగదీష్ ని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు