ధనుష్ ‘కర’ చిత్రానికి షాకింగ్ రెస్పాన్స్..!

ధనుష్ ‘కర’ చిత్రానికి షాకింగ్ రెస్పాన్స్..!

Published on May 1, 2026 8:56 PM IST

kara

తమిళ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కర’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ చిత్రం తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అత్యల్ప ఓపెనింగ్స్‌ను నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరోనా తర్వాత ధనుష్ నటించిన సినిమాల్లో కెల్లా ఇది అత్యంత వీక్ ఓపెనింగ్స్ తెచ్చినట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

​ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై కనీస స్థాయిలో కూడా బజ్ లేకపోవడం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపింది. తమిళనాడులో ధనుష్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా అక్కడ కూడా వసూళ్లు తక్కువగా ఉండటం గమనార్హం. సినిమా ప్రమోషన్లు అంతగా నిర్వహించకపోవడం మరియు ట్రైలర్ ఆకట్టుకునేలా లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ట్రైలర్ కట్ బోర్ కొట్టించేలా ఉండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

​విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రైతులకు సంబంధించిన ఒక సామాజిక సందేశంతో కూడిన మాస్ డ్రామా. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ధనుష్ మినహా ఇతర ప్రధాన పాత్రల్లో పేరున్న నటులు లేకపోవడం మరో లోపంగా మారింది. మరి ఈ సినిమా ధనుష్ కెరీర్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు