ఈ సంక్రాంతి రేస్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో దక్షిణాది నుంచి తమిళ చిత్రం ‘పరాశక్తి'(Parasakhti) కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా శ్రీలీల తమిళ డెబ్యూ చేస్తున్న వచ్చిన ఈ సినిమాని దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించారు. నిజానికి తెలుగులో కూడా విడుదల కావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది.
ఇలా దీనికీ కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ థియేటర్స్ లో నేడు తమిళ్ వెర్షన్ పడింది. మరి ఈ సినిమాకి ఊహించని విధంగా షాకింగ్ రివ్యూస్ అండ్ టాక్ తమిళ సినీ వర్గాల నుంచి వస్తున్నాయి. దాదాపు ఈ చిత్రానికి పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ నే వినిపిస్తుంది. స్టోరీ బాగానే ఉన్నప్పటికీ కథనం దెబ్బ పడినట్టు వినిపిస్తుంది.
అలాగే కొన్ని సీన్స్ క్రింజ్ అని కూడా పిలుస్తున్నారు. దీనితో పాటుగా ఈ సినిమా ముందు శివ కార్తికేయన్ తో కాకుండా సూర్య, దుల్కర్ సల్మాన్ ల దగ్గరకి కూడా వెళ్ళింది. కానీ ఇప్పుడు దీనికి వస్తున్న టాక్ చూసి వాళ్ళు బాగా సేఫ్ అయ్యిపోయారని నెటిజన్స్ అంటున్నారు. మరి లాంగ్ రన్ లో ఎలా ఉంటుందో చూడాలి.
