మన తెలుగు చిత్ర సీమలో ఉన్న అతి తక్కువ మంది లేడీ డైరెక్టర్స్ లో నందిని రెడ్డి ఒకరు. ‘అలా మొదలైంది’తో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ నందిని రెడ్డి తన మూడవ సినిమాని యంగ్ హీరో నాగ శౌర్యతో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాని ఏప్రిల్ 23న అధికారికంగా లాంచ్ చేసారు. అన్ని ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో మొదలైంది.
ఇక నుంచి ఏ మాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూ షెడ్యూల్స్ తో సినిమాని ఫినిష్ చెయ్యాలనే పర్ఫెక్ట్ ప్లాన్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. నాగ శౌర్య సరసన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్ గా కనిపించనుంది. అలా మొదలైంది ఫేం కెఎల్ దామోదర్ ప్రసాద్ శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ కోడూరి సంగీతం అందిస్తున్నాడు. నందిని రెడ్డి మరోసారి యువతను ఆకట్టుకోవాలని పర్ఫెక్ట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా కథని రెడీ చేసినట్లు సమాచారం.
