హర్రర్ ఫిల్మ్ కోసం జర్నలిస్ట్ గా మారిన హాట్ బ్యూటీ

Shraddha-Das
సమ్మర్ మొదట్లో ‘రేయ్’ సినిమాలో హాట్ హాట్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హాట్ బ్యూటీ శ్రద్ధ దాస్. శ్రద్ధ దాస్ ప్రసతుతం తెలుగు, హిందీ భాషల్లో వరుసగా ఆఫర్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం శ్రద్ధ దాస్ విలన్స్ తో కలిసి హిందూపూర్ వీధుల్లో గన్ పట్టుకొని పరిగెడుతోంది. ఇదంతా నేషనల్ అవార్డు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ‘గుంటూరు టాకీస్’ సినిమా కోసం చేస్తోంది. ఈ సినిమా షెడ్యూల్ ని మరో రెండు రోజుల్లో ఫినిష్ చేసి ఓ బాలీవుడ్ సినిమా కోసం పోలాండ్ వెళ్లనుంది.

ఇటీవలే శ్రద్ధ దాస్ హంటింగ్ ఆఫ్ బాంబే మిల్స్ అనే సినిమాకి సైన్ చేసింది. ప్రవాల్ రామన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సచిన్ జోషి హీరోగా నటించనున్నాడు. శ్రద్ధ దాస్ ఈ సినిమాలో తన పాత్ర గురించి తెలియజేస్తూ ‘సచిన్ జోషి సరసన మెయిన్ లీడ్ గా చేయనున్న సినిమా హంటింగ్ అఫ్ బాంబే మిల్స్. ఇదొక హర్రర్ సినిమా. ఈ సినిమాలో నేనొక జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తానని’ తెలిపింది. ఈ నెల 24 నుంచి పోలాండ్ లోని క్రాకౌ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాని ఒకేసారి తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు.

Exit mobile version