‘ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ లాంటి సినిమాల్లో మెరిసిన హీరోయిన్ శ్రద్దా దాస్ తెలుగులో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. అందుకే ప్రయోగాత్మక పాత్రల్లో నటించి అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. కొరియోగ్రఫర విద్యాసాగర్ దర్శకుడిగా మారి ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు.
జగపతిబాబు ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో శ్రద్దా దాస్ ఒక వేశ్య పాత్రలో నటించనుంది. కథ ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే శ్రద్దా పాత్ర సినిమాకు చాలా ప్రధానమైనదని, అందులో బలమైన భావోద్వేగాలతో పాటు నటనకు ఆస్కారముందని తెలుస్తోంది. అందుకే శ్రద్దా ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుందట. ఈరోజు నుండే ఈ సినిమా షూటింగ్ మొదలవుతోంది. చాన్నాళ్ల తర్వాత శ్రద్దా పూర్తి స్థాయిలో నటించనున్న సినిమా ఇదే.


