శ్రీదేవి పాత్రలో ప్రభాస్ హీరోయిన్

Published on Oct 28, 2020 9:49 pm IST

ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి చేసిన సినిమాల్లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘నాగిన’. 1986లో వచ్చిన ఈ ఫాంటసీ డ్రామా శ్రీదేవి నటనా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఈ చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు. ‘నాగిన’ పాత్రలో ఆమె నటనకు గాను గొప్ప ప్రశంసలు అందాయి. ఆమె కెరీర్లో గొప్ప పెర్ఫార్మెన్స్ కలిగిన చిత్రంగా నాగిన పాత్ర నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లకు ఆ చిత్రానికి సీక్వెల్ తీశారు కానీ అదేమంత విజయవంతం కాలేదు. బాలీవుడ్లో ఈ నాగిన పాత్రకు చాలా క్రేజ్ ఉంది.

అందుకే మళ్ళీ ఇప్పుడు ఆ నాగిన పాత్రను రీక్రియేట్ చేస్తూ ‘నాగిన్’ సినిమాను రూపొందించనున్నారు. ఇందులో ‘సాహో’ చిత్రంలో ప్రభాస్ సరసన ఆడిపాడిన స్టార్ నటి శ్రద్దా కపూర్ కథానాయకిగా నటించనుంది. ఈ చిత్రాన్ని విశాల్ ఫురియా డైరెక్ట్ చేయనున్నారు. నాగిన పాత్రలో నటించనుండటం చాలా సంతోషంగా ఉందని, చిన్నప్పుడు నాగినగా శ్రీదేవిగారి నటనను చాలా ఇష్టపడేదాన్ని. అలాంటి పాత్ర చేయాలని చాలా కోరికగా ఉండేది అంటూ ట్వీట్ చేసింది శ్రద్దా. నిఖిల్ ద్వివేది నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక ప్రాంచైజీగా తెరకెక్కనుంది.

సంబంధిత సమాచారం :