త్వరలో “సాహో” పోరాట సన్నివేశాలలో పాల్గొననున్న శ్రద్ధ కపూర్

Published on May 21, 2019 10:00 pm IST

సాహో మూవీ తో టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇవ్వనుంది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. సాహో లో ప్రభాస్ తో జోడి కట్టిన ఈ భామ తన రోల్ని ఛాలెంజ్ గా తీసుకొని చేస్తుందంట. లేడీ పోలీస్ ఆఫీసర్ గా శ్రద్ధ ప్రభాస్ కి ధీటుగా పోరాట సన్నివేశాలలో పాల్గొంటుందంట. దర్శకుడు సుజీత్, యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉండేలా శ్రద్దా పాత్రను డిజైన్ చేసాడంట.

ఇప్పటికే చాలా పోరాటసన్నివేశాలలో నటించిన శ్రద్దా, త్వరలో లొనావ్లా లో చిత్రీకరించనున్న ఉత్కంఠ రేపే ముఖ్య యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొననుందని సమాచారం. ఎక్కడా కంప్రమైజ్ కాకుండా హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీ ని యూ వి క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఆగస్టు 15 న తెలుగు, తమిళ, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More