
ఇండియన్ పాపులర్ సింగర్ శ్రేయ ఘోషల్ గత సంవత్సరం మనం సినిమాలోని చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే అనే పాటతో తెలుగు ప్రేక్షకులకు సూపర్ హిట్ సాంగ్ ఇచ్చింది. అంతే కాకుండా శ్రేయ ఘోషల్ ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ని పడింది. చూడటానికి చూడా చాలా అందంగా ఉండే ఈ శ్రేయ ఘోషల్ తన బాయ్ ఫ్రెండ్ షీలాదిత్య ముఖోపాధ్యాయ ని పెళ్లి చేసుకుంది. ఈ వేడుక నిన్న ముంబైలో జరిగింది. ఈ పెళ్ళికి ముందు రోజు శ్రేయ ఘోషల్ న్యూ లైఫ్ కోసం కాస్త ఆసక్తికరంగా, కాస్త నర్వస్ గా ఉన్నానని తెలిపింది.
శ్రేయ ఘోషల్ దంపతులు త్వరలోనే భారీ రిసెప్షన్ ఏర్పాటు చెఇస్న ఇండియాలోని పలువురు స్టార్స్ ని ఆహ్వానించనున్నారు. శ్రేయ – షీలాదిత్య లకి చాలా కలం నుంచి పరిచయం ఉంది. గత సంవత్సరం వీరిద్దరూ తమ పెళ్ళికి పెద్దల నుంచి అంగీకారం తీసుకున్నారు. షీలాదిత్య ముంబైకి చెందిన ఒక వ్యాపార వేత్త. శ్రేయ తన సాంగ్స్ తో ఇండియా మొత్తం పేరు తెచ్చుకుంది.

