హిందీ ‘దృశ్యం’పై శ్రియ భారీ ఆశలు!

Shriya-Saran
తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు శ్రియ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్లామర్ పాత్రలు కాకుండా నటిగా తానేంటో నిరూపించుకునే హుందాతనమైన పాత్రలు పోషిస్తూ వస్తోన్న శ్రియ, తన తాజా సినిమా ‘దృశ్యం’పై భారీ ఆశలే పెట్టుకున్నారు. మనం, గోపాల గోపాల లాంటి సినిమాలు శ్రియకు మంచి బ్రేక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ దృశ్యం సినిమాతో దేశవ్యాప్తంగా మళ్ళీ సత్తా చాటాలని ఆమె భావిస్తున్నారు.

మళయాలంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాకు రీమేకే ఈ సినిమా. తెలుగు, తమిళం, కన్నడం.. ఇలా ‘దృశ్యం’ కథ ఏ భాషలోకి వెళ్ళినా ఘన విజయం సాధిస్తూ వచ్చింది. దీంతో హిందీ దృశ్యంపై కూడా మొదట్నుంచీ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. అజయ్ దేవ్‌గన్, శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించారు. ఈనెల 31న భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కాబోతోంది.

Exit mobile version