“పుష్పరాజ్”కి హిందీ డబ్బింగ్ ఎవరు చెప్పారంటే?

Published on Dec 10, 2021 12:33 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపధ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే దక్షిణాదితో పాటు ఉత్తరాదిన కూడా బన్నీకి మంచి క్రేజ్‌ ఉంది. ఇటీవలే హిందీలో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్రైలర్‌లో హిందీ డబ్బింగ్‌ వాయిస్‌ పుష్పరాజ్‌ది కాకపోవడంతో ఎవరు డబ్బింగ్ చెప్పి ఉంటారా అంతా అనుకున్నారు. ఓం శాంతి ఓంలో నటించిన శ్రేయాస్‌ తల్పడే పుష్పరాజ్‌కి డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తుంది. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా పేరొందిన శ్రేయాస్‌ తల్పడే గోల్‌మాల్‌ రిటర్న్స్‌, గోల్‌మాల్‌ 3, హౌస్‌ఫుల్‌ 2, గోల్‌మాల్‌ అగైన్‌ వంటి హిందీ చిత్రాలతో పాటు పలు మరాఠీ చిత్రాల్లోనూ నటించారు.

సంబంధిత సమాచారం :