వెంకటేష్ సరసన శ్రీయ?

వెంకటేష్ సరసన శ్రీయ?

Published on Jun 4, 2014 8:47 AM IST

shriya-venkatesh
ఒక హిట్ సినిమా వస్తే చాలు, నటినటులకు సినిమాల పంట పండుతుంది. అయితే ఇప్పుడు శ్రీయ పరిస్థితి కూడా అదే, ఇటివల విడుదలైన ‘మనం’ సినిమా హిట్ తో మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు తన ఖాతాలోకి మరో పెద్ద సినిమా చేరినట్టు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కలిసి నటిస్తున్న ‘ఓ మై గాడ్’ రీమేక్ సినిమాలో శ్రీయాని హీరోయిన్ గా ఎంపిక చేశారు.

అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటణ మాత్రం వెలువడలేదు. డాలీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. సురేష్ బాబు మరియు శరత్ మరార్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు