అభిమానులకు హీరో సూర్య విజ్ఞప్తి

Surya

దక్షిణ చెన్నైలోని పల్లికరనైలో రోడ్డుపై ఫ్లెక్సీ కూలడంతో జరిగిన ప్రమాదంలో శుభశ్రీ అనే 23 ఏళ్ల ఐటీ కంపెనీ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన సర్వత్రా చర్చనీయంశమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో హైకోర్ట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. ఈ సంఘటున తమిళ సినీ పరిశ్రమలో కూడా కదలిక తెచ్చింది.

స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే వాళ్ళ అభిమానులు అనేక ప్రాంతాల్ని ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేస్తుంటారు. అందుకే హీరో సూర్య ఈ నెల 20న తన కొత్త చిత్రం ‘కాప్పన్’ విడుదల సందర్బంగా అభిమానులు ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, చేయాలనుకుంటే ఏవైనా సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు.

ఆయన విజ్ఞప్తి మేరకే ఫ్యాన్స్ వాటికి ఖర్చు పెట్టదలచిన డబ్బుతోనే ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేయడం లాంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. సూర్య తీసుకున్న ఈ నిర్ణయం నిజంగానే అభినందనీయం.

Exit mobile version