
మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా ‘దృశ్యం’. మలయాళంలో మోహన్ లాల్ నటించిన ఈ సినిమాని తెలుగులో విక్టరీ వెంకటేష్ అదే పేరుతో రీమేక్ చేసి తెలుగులో కూడా విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాని ఇప్పుడు హిందీలో కూడా రీమక్ చేయనున్నారని ఇది వరకే తెలియజేశాం. దృశ్యం రీమేక్ లో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అజయ్ దేవగన్ సరసన నటించే ఓ పాత్రకి శ్రియ శరన్ ని ఫైనలైజ్ చేసారు. తెలుగు మరియు మలయాళంలో మీనా చేసిన పాత్రని శ్రియ చేయనుంది. తెలుగు మనం, గోపాల గోపాల సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్స్ అందుకున్న శ్రియ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా హిట్ అందుకుంటుందేమో చూడాలి.. హిందీలో నిషికాంత్ కామత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రసతుతం ఇదే సినిమా రీమేక్ ని తమిళంలో కమల్ హాసన్ చేసాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.