బాలయ్య పక్కనుంటే ప్రొటెక్టివ్ గా ఉంటుంది – శ్రియ


నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’ సెప్టెంబర్ 1న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ శరన్ హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ కలిసి నటించడం ఇది మూడవసారి. బాలకృష్ణతో ఎన్ని సినిమాలు చేసినా కొత్తగానే ఉంటుందన్న శ్రియ ఆయన పక్కనుంటే చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుందనే పెద్ద కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు.

ఆయనతో మొదటి సినిమా ‘చెన్నకేశవరెడ్డి’ చేసేప్పుడు తనకు ఏమీ తెలీదని, అంతా బాలకృష్ణగారు, దర్శకుడు వినాయక్ చూసుకున్నారని, ఆ రోజుల్ని అంత సులభంగా మర్చిపోలేనని, ఇప్పటికీ ఆయన పక్కనుంటే చాలా ప్రొటెక్టివ్ గా అనిపిస్తుందని, ఆ తర్వాత ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేసేప్పుడు కూడా చాలా సపోర్ట్ ఇచ్చారని, తన జీవితంలో ‘వాశిష్టి’ పాత్రే క్లిష్టమైందని, ‘పైసా వసూల్’ లో కూడా తన జంటగా ఫ్రెష్ గానే ఉంటుందని చెప్పుకొచ్చారు.