మలయాళంలో పాడాలని ఉంది – శృతి కోరిక..!

మలయాళంలో పాడాలని ఉంది – శృతి కోరిక..!

Published on Jul 28, 2014 9:15 AM IST

Shruti-hassan

సంగీతం, నటన అంటే శృతికి ప్రాణం. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా పాటలు పాడుతుంది. తన స్వర మాధుర్యాన్ని శ్రోతలకు వినిపిస్తుంది. తాజాగా ‘ఆగడు’ సినిమాలో ప్రత్యేక గీతం పాడింది. ఈ పాటలో ఆమె స్వయంగా డాన్స్ చేస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో పాటలు పడిన శృతికి మలయాళంలో పాట పాడాలని ఉందని తన మనసులో కోరికను బయటపెట్టింది.

‘మలయాళం’ పాటలు చాలా బాగుంటాయి. నాకు మలయాళంలో పాట పాడాలని ఉంది, కాని నాకు భాష సరిగా రాదు. పదాలను సరిగ్గా పలకగాలనో లేదో..? అంటూ చిన్న సందేహం వెలిబుచ్చింది.’ త్వరలో శృతికి మలయాళంలో పాట పడే అవకాశం రావాలని ఆశిద్దాం..!

Untitled-1

తాజా వార్తలు