చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు తెరలేవడంతో మల్టీ స్టారర్ సినిమాలు వరుసగా ఒకదాని తర్వాత సెట్స్ పైకి వెళ్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు వచ్చి వెళ్ళగా, పలు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇటీవలే కింగ్ నాగార్జున – తమిళ హీరో కార్తీ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అధికారికంగా తెలియజేశాము. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలో నటించే హీరోయిన్ పై పలు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఫైనల్ గా ఆ వార్తలకి తెరపడింది.
తాజాగా ఈ సినిమాలో నాగార్జున – కార్తీలతో బ్యూటిఫుల్ శృతి హాసన్ ని ఖరారు చేసినట్లు సమాచారం. అధికారికంగా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. నాగ్ – కార్తీలకి జోడీగా శృతి హాసన్ అయితేనే బాగుంటుందని డైరెక్టర్ వంశీ పైడిపల్లిశృతి ఫైనలైజ్ చేసాడు. ఇప్పటి వరకూ శృతి హాసన్ నాగార్జున, కార్తీలతో సినిమా చెయ్యలేదు. దాంతో ఈ కాంబినేషన్ బాగుంటుందని కూడా ఈ చిత్ర టీం భావిస్తోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నా ఒకే హీరోయిన్ ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 2, సోగ్గాడే చిన్ని నాయన తో బిజీగా ఉంటే, కార్తీ ‘కొంబన్’ అనే మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు. నిర్మాత పరమ్ వి పొట్లూరి పివిపి బ్యానర్ పై ఈ సినిమాని ఒకేసారి తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కనుంది.


