‘శ్రీమంతుడు’, ‘వెల్‌కమ్ బ్యాక్’.. ఇలా రెండు హిట్ సినిమాలతో తెలుగు, హిందీ సినీ పరిశ్రమల్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయిన హీరోయిన్ శృతి హాసన్. ఈ రెండు సినిమాల విజయాల తర్వాత శృతి హాసన్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం తమిళ, హిందీ, తెలుగు ఇలా వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తోన్న ఈ స్టార్ హీరోయిన్, తాజాగా ఓ బాలీవుడ్ సినిమా నుంచి తప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అజయ్ దేవ్‌గన్ హీరోగా ‘డర్టీ పిక్చర్’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మిలాన్ లుథ్రియా తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
కాగా తాజాగా ఈ సినిమా నుంచి శృతి హాసన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తన క్యారెక్టర్‌కు సరైన ప్రాధాన్యత లేదన్న కారణంతో శృతి హాసన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారని సమాచారం. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సౌత్‌లో ఇతర సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంవల్లే అజయ్ దేవ్‌గన్ సినిమా నుంచి శృతి తప్పుకున్నారన్న వార్త కూడా వినబడుతోంది. ఇక శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘పులి’ అక్టోబర్ 1న భారీ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే!


