శృతి ఎంట్రీతో “వకీల్ సాబ్” రిలీజ్ పై క్లారిటీ ఇదే.!

Published on Nov 25, 2020 3:01 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న చిత్రం “వకీల్ సాబ్” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం పవన్ నుంచి రానున్న కం బ్యాక్ చిత్రం కావడంతో దీనిలో ప్రతీ అంశంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఓ పక్క షూట్ విషయంలో లేటెస్ట్ అప్డేట్స్ వినిపిస్తున్నప్పటికీ టీజర్ కోసం కూడా అభిమానులు పడిగాపులు పడుతున్నారు.

కానీ ఓవరాల్ గా మాత్రం ఇపుడు మేకర్స్ సినిమా షూట్ ను పూర్తి చేసే పనిలోనే ఉన్నారని తెలుస్తుంది. అందులో భాగంగానే కొన్ని రోజుల కితం షూట్ లో పాలొన్న పవన్ మళ్ళీ బ్రేక్ ఇచ్చారు. ఇంకా అలాగే తర్వాత మళ్ళీ ఎప్పుడు షూట్ ఉంటుంది అన్న దానితో పాటు ఈ చిత్రం రిలీజ్ పై కూడా ఒక క్లారిటీను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ద్వారా తెలుస్తుంది.

తాజాగా ఆమె జరిపిన ఓ ఇంట్రాక్షన్ లో తాను ఈ చిత్రం షూట్ లో జనవరి నుంచి పాల్గొననున్నట్టు తెలిపింది. సో ఇక్కడ “వకీల్ సాబ్” సంక్రాంతి రేస్ లో లేనట్టే అని ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. మరి మేకర్స్ ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతిలో విడుదల చేస్తారా లేక ముందే చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి దిల్ రాజు నిర్మాణం వహిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More