స్విట్జర్లాండ్ వెళ్ళిన శృతి హాసన్, విశాల్.

Shruti-Haasan-heads-to-Coim
‘యముడు’, ‘సింగం’ చిత్రాల దర్శకుడు హరి దర్శకత్వంలో విశాల్, శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘పూజై’. తెలుగులో ఈ చిత్రాన్ని ‘పూజ’ పేరుతో అనువదిస్తున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఆ రొమాంటిక్ సాంగ్ ను స్విట్జర్లాండ్ లో షూట్ చేయనున్నారు. రేపటి నుండి అక్కడ అందమైన లొకేషన్స్ లో ఈ సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు.

ఆల్రెడీ శృతి హాసన్ స్విట్జర్లాండ్ పయనం అయ్యింది. స్విట్జర్లాండ్ లో జురిచ్ ప్రాంతంలో ఈ సాంగ్ షూటింగ్ చేస్తున్నట్టు శృతి ట్వీట్ ను బట్టి తెలుస్తుంది. ‘బై బై ముంబై.. జురిచ్ కాలింగ్’ అంటూ శృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సినిమాలో శృతి హాసన్ తెలుగు, తమిళ భాషలలో ఒక పాట పాడడంతో పాటు స్వయంగా డబ్బింగ్ చెప్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 22న విడుదల చేస్తున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version