వరుస విజయలాతో హ్యాపీగా ఉన్న శృతి హాసన్

వరుస విజయలాతో హ్యాపీగా ఉన్న శృతి హాసన్

Published on Sep 7, 2015 8:31 PM IST

shruthi-hassan1
కమల్ హాసన్ కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే హీరోయిన్‌గా, మ్యూజిక్ కంపోజర్‌గా, సింగర్‌గా ఇలా మూడు భిన్న విభాగాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతున్నారు శృతి హాసన్. ఇక తనదైన మార్క్ యాక్టింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్, ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ -శృతి హాసన్ జంటగా తెరకెక్కిన శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌ను ఇంకా ఎంజాయ్ చేస్తుండగానే శృతి హాసన్ మరో బాక్సాఫీస్ సక్సెస్ కొట్టారు.

శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన వెల్‌కమ్ బ్యాక్ అనే సినిమా గత శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఇక వెల్‌కమ్ బ్యాక్‌కు వస్తోన్న రెస్పాన్స్ పట్ల శృతి హాసన్ చాలా హ్యాపీగా ఉన్నారు. వరుస సక్సెస్‌లతో జర్నీ అద్భుతంగా ఉందని శృతి హాసన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే తెలుగు, తమిళంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న శృతి, త్వరలోనే బాలీవుడ్‌లో కూడా స్టార్‌డం సొంతం చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు. ప్రస్తుతం అజిత్, విజయ్ లాంటి సూపర్ స్టార్స్ సినిమాల్లో నటిస్తోన్న శృతి, ఆ సినిమాలు తనకు మరింత గుర్తింపు తెస్తాయని భావిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు