
కమల్ హాసన్ కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా అనతి కాలంలోనే హీరోయిన్గా, మ్యూజిక్ కంపోసర్గా, సింగర్‌గా ఇలా మూడు భిన్న విభాగాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటూ దూసుకుపోతోంది శృతి హాసన్. నిజానికి శృతి హాసన్ మొదట సింగర్‌గానే సినీ పరిశ్రమకు పరిచయమైనా కూడా ఆ తర్వాత హీరోయిన్గా వరుస అవకాశాలతో బిజీగా మారిపోవడంతో సింగింగ్ను అడపదడపా మాత్రమే కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాను హీరోయిన్గా నటించిన పలు సినిమాల్లో పాటలు కూడా పాడుతూ హీరోయిన్గా, సింగర్‌గా రెండిట్లోనూ మెప్పించింది.
తాజాగా తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా రూపొందుతోన్న భారీ బడ్జెట్ సినిమా పులిలో హీరోయిన్గా నటిస్తోన్న శృతి హాసన్, ఇదే సినిమాలో ఓ పాట కూడా పాడి మెప్పించనుంది. చింబు దేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియడ్ యాక్షన్ ఎంటర్టైనర్కు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు దేవిశ్రీ స్వరపరచిన ఓ పాట కోసం హీరో విజయ్‌తో కలిసి శృతి హాసన్ గొంతు కలిపింది. ఈరోజే ఇందుకు సంబంధించిన రికార్డింగ్ కూడా జరిగిపోయింది. ఇక ఆగష్టు 2న భారీ ఎత్తున ‘పులి’ ఆడియో ఆవిష్కరణ వేడుక జరగనుంది.