మొదటిసారి గ్లామర్ పాత్రలో మెరవనున్న శృతి హాసన్

మొదటిసారి గ్లామర్ పాత్రలో మెరవనున్న శృతి హాసన్

Published on Mar 18, 2013 6:25 PM IST

Shruthi-Haasan-

శృతి హాసన్ తెలుగులో మూడే సినిమాలు చేసినా ‘గబ్బర్ సింగ్’ హిట్ తో మన చిత్రసీమలో బిజీ తారగా వెలిగిపోతుంది. ‘అనగనగా ధీరుడు’ సినిమాలో రాకుమారిగా కనిపించిన తను, ‘ఓ మై ఫ్రెండ్’ సినిమాలో పక్కింటి అమ్మాయిగా, ‘గబ్బర్ సింగ్’లో పల్లె పిల్లగా కనిపించింది. ప్రస్తుతం తను టాలీవుడ్లో చేస్తున్న ‘బలుపు’ సినిమాలో మొదటిసారి గ్లామరస్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో “నా కెరీర్లో మొదటిసారిగా తెలుగులో నేను జీన్స్ పాంట్స్, మినీ స్కర్ట్స్ ధరించాను. ఇలాంటి గ్లామర్ రోల్ చేయడం సరదాగా ఉందని” జోక్ చేసింది.

అంతే కాదు. ‘బలుపు’ సినిమాలో మొదటిసారిగా ఒక మాస్ పాటకి డాన్స్ చెయ్యనుంది. ప్రస్తుతం ఈ పాటని రామోజీ ఫిలిం సిటీలో తీస్తున్నారు. శృతి హాసన్ ఈ పాటలో చూపిన మార్పును చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి సెకండ్ హీరోయిన్. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా వి. పోట్లురి నిర్మాత. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు