పవన్ కళ్యాణ్ తో మళ్లీ నటిస్తోందా ?

Published on Mar 7, 2020 1:22 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన 28వ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

కాగా ఈ చిత్రంలో కథానాయకిగా శృతిహాసన్ నటించవచ్చనే వార్తలు ఇప్పటికే వినిపించిన సంగతి తెలిసిందే. శృతిహాసన్ గతంలో పవన్, హరీష్ శంకర్ చేసిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించడం జరిగింది. ఒకరకంగా ఆ సినిమాతోనే ఆమె స్టార్ హీరోయిన్ అయ్యారు. ఆ తర్వాత పవన్ చేసిన ‘కాటమరాయుడు’లో మెరిసింది శృతి.

అదే తెలుగులో ఆమె చేసిన లాస్ట్ ప్రాజెక్ట్. దాని తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న అమె ఈ మధ్యే రవితేజ ‘క్రాక్’ చేస్తోంది. పవన్ తో ఆమె జోడీకి మంచి క్రేజ్ ఉండటం, పైగా తమ ముగ్గురి కాంబినేషన్ కలిసిరావడంతో హరీష్ ఆమెను కథానాయకిగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. కాగా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న వేణు శ్రీరామ్, క్రిష్ చిత్రాల్లో ఒకటి పూర్తవగానే హరీష్ శంకర్ చిత్రం మొదలుకానుంది.

సంబంధిత సమాచారం :

More