ఆగడు ఐటెం సాంగ్ కి శృతి రెడీ

Published on Jul 25, 2014 10:00 am IST

Shruti-Haasan

మహేష్ బాబు తో జతకట్టి ఐటెం సాంగ్ లో ఆడిపాడడానికి అందాల భామ శృతిహాసన్ సిద్దమయ్యింది

మహేష్, శృతిలపై ఈ పాటను జూలై 26నుండి చిత్రీకరించనున్నారు. ఈ పాటకోసం ఒక ప్రత్యేక సెట్ ని సైతం నిర్మించారు. తమన్ ఆల్బమ్ లోకెల్లా మంచి ట్యూన్ ని ఈ పాటకే ఇచ్చాడని సమాచారం

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తుంది. శ్రీను వైట్ల ఈ సినిమాకి దర్శకుడు. ఈ కామెడి యాక్షన్ ఎంటర్టైనర్ లో బ్రహ్మానందం ఒక ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని 14రీల్స్ సంస్థ నిర్మిస్తుంది. మహేష్ తో వీరికిది మూడవ సినిమా కావడం విశేషం

సంబంధిత సమాచారం :