షాకింగ్ నిర్ణయం తీసుకున్న శృతిహాసన్

shruti-haasan
తమిళ, హిందీ సినిమా రంగాలలో సైతం చేతినిండా ప్రాజెక్ట్ లతో శృతిహాసన్ బిజీగా వుంది. తెలుగులో ఈ భామ వెంట ఎంతమంది నిర్మాతలు పడుతున్నారో చెప్పనవసరం లేదు. ఈ భామ తిన్గ్మాన్షు ధులియా దర్శకత్వంలో యారా అనే సినిమాలో నటిస్తున్నట్లు ఇదివరకే తెలిపాం. ఈ సినిమాలో అమిత్ సాద్, విద్యుత్, ఇర్ఫాన్ ఖాన్ తదితరులు నటిస్తున్నారు

ఈ సినిమాకు సంబంధించిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఈమె కెరీర్ లో కనీవినీ ఎరుగని పాత్రలో నటించనుంది. దర్శకుడిని ఒప్పించి మరీ ముసలి పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అన్ని సినిమాలలో గ్లామర్ పాత్ర పోషిస్తున్న ఈ భామ నిర్ణయం తీసుకుంది అంటే అది ఆశ్చర్యమనే
చెప్పాలి

ప్రస్తుతం శృతి చెన్నైలో పూజై సినిమా షూటింగ్ లో బిజీగా వుంది. హరి ఈ సినిమాకు దర్శకుడు. విశాల్ హీరో

Exit mobile version