బాలీవుడ్ సినిమాకి సైన్ చేసిన శృతి హాసన్ !

దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ గత కొన్నాళ్లుగా అటు తమిళంలో కానీ ఇటు తెలుగులో కానీ కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ సైన్ చేయలేదు. దీంతో కొద్దికాలం ఆమె సినిమాల నుండి బ్రేక్ తీసుకోవాలనే యోచనలో ఉన్నారనే వార్తలు కూడ వచ్చాయి. కానీ వాటన్నింటినీ కాదంటూ శృతి కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అయితే అది దక్షిణాది సినిమా కాదు బాలీవుడ్ చిత్రం. బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ మహేష్ మంజ్రేకర్ తో ఒక సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా శృతిని తీసుకున్నట్టు నిర్మాత విజయ్ గలాని తెలిపారు. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్ళనుంది.