కలకత్తా నేపథ్యంలో ‘శ్యామ్ సింఘ రాయ్’ !

Published on Sep 21, 2020 9:45 am IST

నేచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో రాబోతున్న ‘శ్యామ్ సింఘ రాయ్’ సినిమా కలకత్తా నేపథ్యంలో సాగుతుందట. అందుకే సినిమాలో కలకత్తాని చూపించడానికి మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమా కథే కాస్త ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా సినిమా వుంటుందని.. ముఖ్యంగా పాత కలకత్తా లుక్ కావాల్సి వుందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కలకత్తా వెళ్లినా పాత లుక్ వుండదు కాబట్టి, ఇక్కడే పాతతరం కలకత్తా లుక్ వచ్చేలా సెట్స్ నిర్మిస్తున్నారు.

హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో సెట్స్ వేస్తున్నారట. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం క్రేజీ బ్యూటీ సాయి పల్లవిని తీసుకోబోతున్నారని.. సాయి పల్లవి రోల్ కీలకం అని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమాలో ఏదో కొత్త కంటెంట్ ఉందనే ఫీలింగ్ కూడా జనంలో మొదటి నుండి బాగా క్రియేట్ అయింది. ఏమైనా సాయి పల్లవి క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో వినూత్నంగా ఉండబోతుందట.

నాని మొదటి నుండి ప్రేక్షకులకు కాస్త వైవిధ్యమైన కథలు చెప్పడానికి.. మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ తన సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంటుందనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అందుకే మన రచయితలూ, దర్శకులు కూడా నాని కోసం కాస్త కొత్తగా ఆలోచిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More