గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తూనే ఉన్నాయి. కాగా ప్రభాస్ పెళ్లి గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. ప్రస్తుతం ప్రభాస్ చేస్తోన్న ‘జాన్’ సినిమా అనంతరం ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారట. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లి పై ఆయన పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలా దేవీ స్పందించారు.
శ్యామల దేవి మాట్లాడుతూ.. ‘మేము కూడా ప్రభాస్ పెళ్లి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అయితే ప్రభాస్ పెళ్లి పై వస్తోన్న వార్తలన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే. వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇక మా కుటుంబం పెద్దది. అందరితో కలిసిపోయే అమ్మాయి కావాలి. ప్రస్తుతం అలాంటి అమ్మాయి కోసం చూస్తున్నాం. అన్ని కుదిరికా ప్రభాస్ పెళ్లి గురించి మేమే అధికారికంగా చెబుతాం’ అని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ప్రభాస్ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ చిత్రం చేస్తున్నాడు. ఇది పీరియాడిక్ చిత్రమని, కథ వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. మూడు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నీ గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 2020 చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమాకి టైటిల్ ‘జాన్’ అని ప్రచారంలో ఉంది.
