మణిరత్నం సినిమాకు సంగీత దర్శకుడిగా సిడ్ శ్రీరామ్

మణిరత్నం సినిమాకు సంగీత దర్శకుడిగా సిడ్ శ్రీరామ్

Published on Jul 9, 2019 8:17 PM IST

Sid Sriram

ప్రముఖ గాయకుడు సిడ్ శ్రీరామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. గాత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. తమిళంలో పలు హిట్ పాటలను పాడిన ఆయన తెలుగులో ఈమధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యారు. ‘గీత గోవిందం, హుషారు, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా, పడి పడి లేచే మనసు’ లాంటి సినిమాల్లో హిట్ పాటల్ని ఆలపించి ఇక్కడ కూడా బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఆయన త్వరలో సంగీత దర్శకుడిగా మారనున్నాడు.

తమిళంలో మణిరత్నం నిర్మాణంలో నిర్మితమవుతున్న ‘వానం కొట్టటుం’ సినిమాకు సిడ్ సంగీతం అందించనున్నాడు. మొదట్లో వేరొకర్ని అనుకున్నా ఆ తర్వాత సిడ్ శ్రీరామ్ అయితే కొత్త తరహా సంగీతం చేయగలడని నమ్మి ఆయనకు ప్రాజెక్ట్ అప్పజెప్పారట. విక్రమ్ ప్రభు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధన డైరెక్ట్ చేస్తున్నారు.

తాజా వార్తలు