హర్ట్ అయిన సిద్ధార్థ్? “అనిమల్” విషయంలో కామెంట్స్ వైరల్

హర్ట్ అయిన సిద్ధార్థ్? “అనిమల్” విషయంలో కామెంట్స్ వైరల్

Published on Apr 13, 2024 5:01 PM IST

తెలుగు సహా తమిళ్ సినిమాలో మంచి ఫేమ్ ఉన్న టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ రీసెంట్ గానే తన పెళ్లి విషయంలో మరోమారు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే తాను చేసిన లాస్ట్ సినిమా “చిత్తా” తెలుగులో “చిన్నా” గా రిలీజ్ అయ్యి మంచి ఆదరణనే అందుకుంది. కానీ ఈ సినిమా ఫలితం విషయంలో మాత్రం ఇంకా సిద్ధార్థ్ కి మనసు సెట్ అవ్వలేనట్టుంది.

అప్పుడు తెలుగులో కూడా థియేటర్స్ దొరకని సమయంలో తన ఆవేదన వ్యక్తం చేసాడు. అయితే తాజాగా కోలీవుడ్ లో జరిగిన ఓ అవార్డ్స్ వేడుకలో తాను చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గత ఏడాది వచ్చిన సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ “అనిమల్” తో తను పోలుస్తూ కామెంట్స్ చేశారు. అనిమల్ లాంటి ఓ సినిమా చూసేందుకు కొంతమంది మగవాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ చిత్తా లాంటి సినిమాని చూసేందుకు మాత్రం వారు లేరు అంటూ కామెంట్స్ చేసాడు.

దీనితో తన సినిమా విషయంలో మాత్రం ఒకింత హర్ట్ అయ్యాడనే అనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి కూడా విడుదల అయ్యిన అన్ని భాషల్లోని మంచి టాక్ నే వచ్చింది అయినా ఇప్పటికీ సిద్ధార్థ్ అదే కామెంట్స్ చేయడం మాత్రం ఆపడంలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు