కైరా అద్వానీతో డేటింగ్ చేయట్లేదంటున్న యంగ్ హీరో

కైరా అద్వానీతో డేటింగ్ చేయట్లేదంటున్న యంగ్ హీరో

Published on Jul 3, 2019 2:12 AM IST

సినీ పరిశ్రమలో యువ హీరో హీరోయిన్ల మధ్య నడిచే రిలేషన్ గురించి అనేక రూమర్లు వస్తుంటాయి. బాలీవుడ్ పరిశ్రమలో అయితే ఈ పుకార్ల హడావుడి మరీ ఎక్కువగా ఉంటుంది. తెలుగులో ‘భరత్ అనే నేను, విన్యా విధేయ రామ’ అనే సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ కైరా అద్వానీ హిందీలో పలు సినిమాలు చేస్తోంది.

వాటిలో ఒకటి సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి చేస్తున్న ‘షేర్ షా’ కూడా ఒకటి. ఈ సినిమా మొదలైనప్పటి నుండి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారని అంతా అనుకున్నారు. నిన్నటి వరకు వీటిపై స్పందించని సిద్దార్థ్ తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కైరా ప్రస్తావన రాగానే డేటింగ్ వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేసి ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమేనని, ఇలాంటి రూమర్లను చూసి నవ్వుకుంటుంటామని క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు