సూపర్ హీరో నిర్మాణ సంస్థతో సిద్ధార్థ్ కొత్త సినిమా

సూపర్ హీరో నిర్మాణ సంస్థతో సిద్ధార్థ్ కొత్త సినిమా

Published on May 18, 2024 1:06 PM IST


కోలీవుడ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “చిన్నా” తో మంచి హిట్ అందుకోగా తెలుగులో కూడా మరోసారి మంచి బజ్ ని తాను అందుకున్నాడు. అయితే ఇప్పుడు సిద్ధార్థ్ లేటెస్ట్ గా కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. కోలీవుడ్ లో టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ తో ఇంట్రెస్టింగ్ సూపర్ హీరో చిత్రం “మహావీరుడు” చేసిన నిర్మాణ సంస్థ శాంతి టాకీస్ వారు కాంబినేషన్ లో చేయబోతున్నట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు.

ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీ గణేష్ వర్క్ చేయనుండగా ఈ చిత్రం సిద్ధార్థ్ కెరీర్ లో 40వ సినిమాగా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రాన్ని కూడా ఒక గ్లోబల్ రీచ్ ఉండే కాన్సెప్ట్ తోనే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుపుతున్నారు. అలాగే ఈ జూన్ నుంచే సినిమా స్టార్ట్ కానున్నట్టుగా వినిపిస్తుంది. అలాగే ఇతర కాస్ట్ సహా సాంకేతిక వర్గం సంబంధించిన వివరాలు మున్ముందు రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు