సిద్ధార్థ్ ను డైరెక్ట్ చేయనున్న లేడీ డైరెక్టర్?

సిద్ధార్థ్ ను డైరెక్ట్ చేయనున్న లేడీ డైరెక్టర్?

Published on Feb 27, 2024 3:07 PM IST


చిత్త (తెలుగులో చిన్నా)తో విజయాన్ని అందుకున్న నటుడు సిద్ధార్థ్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అతను లేడీ డైరెక్టర్ తో వర్క్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం లో తెరకెక్కిన రీసెంట్ మూవీ లాల్ సలామ్. ఈ చిత్రం లో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది.

అయితే, ఐశ్వర్య రూపొందించిన స్క్రిప్ట్‌ పై సిద్ధార్థ్ ఆసక్తి కనబరిచాడని, మరియు కొన్ని సర్దుబాటులను అభ్యర్థించాడని పుకార్లు వస్తున్నాయి. లాల్ సలామ్ సినిమా పరాజయం పాలైనప్పటికీ ఐశ్వర్యకు మరో అవకాశం వచ్చింది అని చెప్పాలి. మరి ఈ ఛాన్స్‌ని ఆమె ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. సిద్ధార్థ్ ఇన్‌వాల్వ్‌మెంట్‌తో ఈ ప్రాజెక్ట్‌కి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు