ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సిద్ధార్థ్ ఎమోషనల్ థ్రిల్లర్.!

ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సిద్ధార్థ్ ఎమోషనల్ థ్రిల్లర్.!

Published on Nov 28, 2023 6:59 AM IST

కోలీవుడ్ టాలెంట్ హీరో మన టాలీవుడ్ కి బాగా సూపరిచితుడు అయినటువంటి సిద్ధార్థ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రమే “చిన్నా”. దర్శకుడు ఎస్ యూ అరుణ్ కుమార్ తమిళం లో “చిత్తా” పేరిట తెరకెక్కించగా అక్కడ పెద్ద హిట్ అయ్యిన ఈ చిత్రంలో తెలుగు సహా ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని సాధించింది.

అయితే ఓ ఎమోషనల్ అండ్ సాలీడ్ థ్రిల్లర్ గా దర్శకుడు దీనిని తెరకెక్కించగా ఎట్టకేలకు ఓటీటీ లో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు డిస్నీ+ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మరి అందులో ఈ సినిమా ఈరోజు నుంచి అందుబాటులో వచ్చింది. మరి ఈ సినిమా చూడాలి అనుకునేవారు ఇప్పుడు తప్పకుండా ట్రై చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు