సిద్ధార్థ్ సినిమాకు ‘కళాకారుడు’ టైటిల్ ఖరారు

సిద్ధార్థ్ సినిమాకు ‘కళాకారుడు’ టైటిల్ ఖరారు

Published on May 19, 2014 12:23 PM IST

sidarth
‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న యువ నటుడు సిద్ధార్థ్ గత కొంత కాలంగా తెలుగు సినిమాలకి దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అయన తమిళనాట రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం సిద్ధార్థ్వసంత బాలన్ దర్శకత్వంలో వస్తున్న ‘కావియ తలైవన్’ సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అయితే ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేస్తున్నారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకి ‘కళాకారుడు’ టైటిల్ ని ఖరారు చేశారు.

స్వాతంత్ర్యానికి ముందు జరిగిన ఒక కధాంశంతో వస్తున్న ఈ సినిమాలో పృథ్వీ రాజ్, వేదిక, నాజర్ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఏఅర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జులై నెలలో విడుదల కానుంది.

తాజా వార్తలు