‘టక్కర్’ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మెగా ప్రిన్స్ !

‘టక్కర్’ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మెగా ప్రిన్స్ !

Published on Dec 10, 2019 12:05 AM IST

హీరో సిద్ధార్థ్, దివ్యంశ కౌశిక్ హీరో హీరోయిన్లు గా రాబోతున్న తాజా సినిమా ‘టక్కర్’. కాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో అభిమన్యు సింగ్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. చాల భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వైర్క్స్ జరుపుకుంటుంది.

2020 ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సుధన్ సుందరం, జయరాం నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. దర్శకుడు కార్తిక్ జీ క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు