బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ!

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ!

Published on Dec 11, 2023 10:39 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం డీజే టిల్లు కి సీక్వెల్ అయిన టిల్లు స్క్వేర్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే సిద్దు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చింది.

శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నారు. SVCC 37 గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. అందుకు సంబందించిన ఒక పోస్టర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేయగా, అది కాస్త వైరల్ గా మారుతోంది. సిద్దు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో చేయనున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు