“సలార్ 2” పై సిల్లీ రూమర్స్.!

“సలార్ 2” పై సిల్లీ రూమర్స్.!

Published on Apr 26, 2024 6:04 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ (Sruthi Haasan) హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కోసం తెలిసిందే. మరి ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాను చూపించాడు. అయితే ఈ సినిమాకి పార్ట్ 2 “సలార్ శౌర్యంగ పర్వం” ని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై భారీ హైప్ నెలకొంది.

అయితే ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రీసెంట్ గా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటి కియారా అద్వానీ (Kiara Advani) ఉందని కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ తెలుస్తుంది. ఇవన్నీ జస్ట్ సిల్లీ రూమర్స్ మాత్రమే అన్నట్టు తెలుస్తుంది. హీరోయిన్ గా శృతి హాసన్ కొనసాగుతుంది అని కియారా మరే ఇతర స్టార్ హీరోయిన్ ఉండదనే వినిపిస్తుంది. అలాగే యంగ్ బ్యూటీ సిమ్రాత్ కౌర్ సాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు